Thursday, September 2, 2021


 Dia

Life is full of surprises

 

 96 సినిమా తరవాత, మాస్ మసాలా లేకుండా,  ఇప్పుడు కూడా మంచి లవ్ స్టోరీ సినిమా లు తీయ వచ్చు, తీసి ప్రేక్షకుడిని మెప్పించ వచ్చు అని మరొక్కసారి  ప్రూవ్ సినిమా  Dia. 


ఒక అమ్మాయి లేదు, కాదు ప్రస్తుతం నువ్వు నా మనసులో లేవు అని చెబితే దాన్ని ఎలా తీసుకోవాలో తెలీకుండా, అమ్మాయి అంటే ఒక వస్తువు, తాను ఇష్టపడ్డ వస్తువు తనను కాదనడమేంటి అన్న మూర్ఖత్వం, తన స్థాయి స్థోమతలను మరచి (బహుశా మగవాడు అన్నది చాలు.. అంతకన్నా అర్హత ఇంకేంకావాలి అన్న స్పృహ కావచ్చు ) ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్న ఈ 2021 నాటి ఆధునిక కాలంలో.... 


పోరంబోకు క్యారక్టర్ తో మొదలై సొల్లు డైలాగులతో పడేసి (ఇలాంటి వాటికి కూడా పడిపోతారా అని మనకి అనిపించేంత సొల్లు), అమ్మాయి తండ్రి (బేసిగ్గా  హీరోయిన్ తండ్రి ) పాత్ర అంటే ఈ ప్రపంచంలో వాడిని మించిన తింగరి గాడు లేడు  అన్నంతగా బిల్డ్ చేసి చివరకు  అంటే క్లైమాక్స్  లో, అంతవరకూ పోరంబోకుగా తిరిగిన మన హీరో ఒక జీవితానికి సరిపడే ఫిలాసఫీ డైలాగులకు, ఇంకా తన కూతురికి వీడ్ని మించిన రాజ కుమారుడు దొరకడు, వీడు దొరకడం తమ పూర్వ జన్మ పుణ్యం  అని అనిపించి మనల్ని కూడా కన్విన్స్ చేసి శుభం కార్డు పడితే....  What a Love Story అనుకొంటూ...పరవశించి పోయి కాసుల వర్షం కురిపిస్తున్న  ఈ రోజుల్లో ...... ఎన్ని వందల సినిమాలు చూడలేదూ...... 


తాను ప్రేమించిన అమ్మాయి, తనను ప్రేమించిన అమ్మాయి మనసులో ఇప్పుడు తాను లేడు అన్న విషయాన్ని, నిజాన్ని హుందాగా ఆహ్వానించి, ఆ అమ్మాయి ఇష్టానుసారమే నడచుకొనిస్తూ, ఆ అమ్మాయి ఇష్టాన్ని గౌరవించి నడచుకోవడం, దాన్ని స్క్రీన్ పై ప్రెసెంట్ చేసిన విధానం, ప్రేక్షకుడిని కన్విన్స్ చేసిన విధానం సినిమా హైలైట్... ఇది ఒక లీడ్ క్యారెక్టర్ తోనే కాకుండా ఇద్దరు మేల్ లీడ్ చారక్టర్లు ద్వారా చెప్పించడం.... డైరెక్టర్ K S అశోక్  ను ఎంత అభినందించినా తక్కువే. 


ఇంకో సంగతేంటంటే... 


అమ్మాయితో ప్రవర్తించే విధానం, తాను తప్పుగా ప్రవర్తిస్తే తన తల్లి పెంపకాన్ని అగౌరవ పరచడం తప్ప మరోటి కాదు అని లీడ్ హీరో క్యారెక్టర్ తో చెప్పించడం.....  బ్యూటిఫుల్.... 


అంటే ఒక అమ్మాయి కాదంటే ఆ అమ్మాయిని నడి రోడ్డు లో చంపెయ్యటానికి సిద్దమవుతున్న వారి విషయంలో వారి పేరెంట్స్, వారి పెంపకం ప్రభావం ఎంత.... ఆలో చించవలసిన విషయం....  


ఒక సినిమా తో ప్రవర్తన లో మార్పు వస్తుందా?.... 


మార్పు వస్తుందా రాదా.... అనేది ఒకవైపైతే . ... 


స్క్రీన్ మీద చూపించే వయొలెన్స్ కు, ప్రత్యేకించి బుల్లి తెర డైలీ సీరియల్స్  లో చూపించే క్రైమ్ , సాధారణ కుటుంబాలలో ఇలాంటి కుట్రలు, ఆసహజ సంఘటనలూ, పాత్రల అతిప్రవర్తనలూ  చూస్తే.... వాస్తవంలో ఈ మధ్య మనం చూస్తున్న సంఘటనలు... ముక్యంగా స్త్రీలు తమ భర్తలను గానీ ప్రియులను కానీ చంపడం... చంపించడం...  లాంటివి....  వాస్తవం లో జరుగుతున్నాయి కాబట్టి సీరియల్స్  లో పెడుతున్నారా లేక సీరియల్స్  లో చూసి ఇంన్ఫ్లూయెన్స్  అవుతున్నారా........ సమాధానం దైవానికి తెలియాలి.... 


ప్రస్తుతం ఈ  OTT  యుగంలో సినిమాలలో క్రైమ్ అంతా మన నట్టింట్లోకి వచ్చేసింది....  మన పిల్లలు చూసీ చూసీ చంపడం చంపించడం,ఇదంతా చాలా సహజం అనుకొనేట్లుగా వయొలెన్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నారు....  సినిమా  అంటే make  to believe అన్నప్పుడు వయొలెన్స్ జరిగింది అన్న భావన ప్రేక్షకుడి మైండ్ లో కలిగిస్తే చాలదా..... మొత్తం క్రైమ్ సీన్ అంతా తెరపైన చూపిస్తే వచ్చే లాభమేంటి.... నష్టం తప్ప... 


సరే ఇంక మన Dia  సినిమాలోకొస్తే నాకు రెండు సీన్లు డైరెక్టర్ ఏ లెవెల్ టాలెంట్ ఏంటో  చెపుతాయి. 


1) అమ్మ గిఫ్టుగా కొడుక్కి బైక్ కొనిఇచ్చే సీన్లో  సస్పెన్సు  బిల్డ్ చేసిన విధానం  ...... సూపర్ టచ్చింగ్.... సింప్లీ సుపర్బ్ 


2) ప్రాబ్లమ్స్ లేని మనుషులు ఎక్కడ వుంటారు చూపించి ఆ సీన్ లో ప్రాబ్లమ్స్ లేని లైఫ్ లేదు అని కన్విన్స్ చెయ్యడం..... వండ్రఫుల్.... వెరీ లాజికల్ .... 


ఇంక సినిమా ముగింపు..... 


ప్రతి సినిమా హ్యాపీ గానే ఎండ్ కావాలి అని మైండ్ ఫిక్స్ చేసుకొని సినిమా చూసే సగటు తెలుగు ప్రేక్షకుడికి.... ఆ ముగింపు నచ్చక పోవచ్చేమో..... 


కానీ Dia  సినిమా టైటిల్ ట్యాగ్ లైన్ Life is  Full of Surprises ను  పూర్తీగా  జస్టిఫై చేసిన ముగింపు. 


Director KS Ashok needs to be appreciated for his wonderful matured thought process.


The lead actors Pruthvi Ambaar, Kushi, Dheekshith Shetty performances are too good.



--------    ****  -------


ఈ సినిమా యూట్యూబ్ లో తెలుగులో వచ్చిన తరవాత మరీ తెలుగు లో రీమేక్ అయ్యి Dear Megha అని రాబోతోంది.... 

వచ్చిన సినిమా నే మరీ  కోట్లు ఖర్చుపెట్టి తీయటం మన సినిమా వాళ్లకు చాలా సరదా....  అంటే నా ఉద్దేశం ఇంకో మంచి కాన్సెప్ట్ మీద ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఇంకో మంచి సినిమా తీయవచ్చుకదా అని ...... ఎవరి దురద వారిది.... 


చూద్దాం... అది కూడా....