Sunday, October 26, 2014

శివమే...... సుందరం.


శివమే...... సుందరం

విశ్వేశ్వరా ఏనుగు తోలు ధరించే నీకు మొక్కుతాము
పోలోలు, అరమానీలలో మునిగితేలుతుంటాము
శివ తత్వం భోధపడని శివ భక్తులం మేము.
 
విశ్వేశ్వరా నందివాహనుడవైన నీకు మొక్కుతాము
టయోటా, హోండాలూ చాలక, ఆడీ బెంజు లకై చూస్తూంటాము
శివ తత్వం భోధపడని శివ భక్తులం మేము.
 
విశ్వేశ్వరా భస్మదారుడవైన నీకు మొక్కుతాము
వంటినంతా గుస్సి చానెల్లలో ముంచి కులుకుతుంటాము
శివ తత్వం భోధపడని శివ భక్తులం మేము.
 
విశ్వేశ్వరా విశాలాక్షి నీలో సగంఅన్న నీకు మొక్కుతాము
దేవీ స్వరూపినులను నిత్యం ఆశ్రువులకంకితం ఇస్తూఉంటాము
శివ తత్వం భోధపడని శివ భక్తులం మేము.
 
విశ్వేశ్వరా ఝటా ఝూటాలంకారివైన నీకు మొక్కుతాము
జుట్టును గింగరాలు తిప్ప తంటాలు పడుతుంటాము
శివ తత్వం భోధపడని శివ భక్తులం మేము.
 
విశ్వేశ్వరా నాగాభరుడైన నీకు మొక్కుతాము
నిగ నిగ నగలతో ఒంటిని నింప తపిస్తూ ఉంటాము
శివ తత్వం భోధపడని శివ భక్తులం మేము.
 
విశ్వేశ్వరా గరళం గొంతులో దాచిన నీకు మొక్కుతాము
ఎదుటి మనిషిపై నిత్యం విషం కక్కచూస్తూంటాము
శివ తత్వం భోధపడని శివ భక్తులం మేము.
 
విశ్వేశ్వరా మంచు శిఖరం ఆవాసమైన నీకు మొక్కుతాము
ఎన్ని అంతస్తులున్నా చాలని అసంత్రుప్తులం మేము
శివ తత్వం భోధపడని శివ భక్తులం మేము.
 
విశ్వేశ్వరా కాముని ధహించిన నీకు మొక్కుతాము
జగత్ మొహంలో పడి కొట్టుకుంటూ ఉంటాము మేము
శివ తత్వం భోధపడని శివ భక్తులం మేము.
 
విశ్వేశ్వరా ఆదిభిక్షువువైన నీకు మొక్కుతాము
ఎన్ని ఆస్తులున్నా సరిపెట్టుకోలేము మేము
శివ తత్వం భోధపడని శివ భక్తులం మేము.
 
విశ్వేశ్వరా... విశ్వమంతా భక్తులు నీకు ఈ రమేశం అందులో ఒక్కడు
అజ్ఞానాంధకారం లో ఉన్న మమ్ము క్షమించి,
నీ జ్ఞానవెలుగులవైపు నడిపించి రక్షించు భోలాశంకరా.....
 
 
శివ తత్వం భోధపడని శివ భక్తులం మేము.
 

 

 

 

Sunday, May 25, 2014

తెలుగు వీర లేవరా.........


విభజన జరిగి పోయింది.... తెలుగు వారికి రెండు రాష్ట్రాలు........

తెలంగాణా.....

ఆంధ్రప్రదేశ్.....
 
తెలంగాణా ప్రజలు వారి ఉద్యమ నాయకులకు పరీక్ష పెట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి, అభివృధి చేసి చూపించి సమాధానం చెప్పుకోవాలి వారు, ఉద్యమంలో వారు చేసిన వ్యాఖ్యల్లో ఎంత నిజముందో....

మిగులు బడ్జెట్టుతో మొదలు పెట్టి, అన్ని హంగులూ ఉన్న హైదరాబాద్ నగరం రాజధానిగా ఏర్పడ్డ రాష్ట్రం గురించి పెద్దగా విచారించేదేమీ లేదు.....

ప్రజలకు తొందరలోనే సమాధానం లభిస్తుందని ఆసిస్తూ..... రాష్ట్ర ఆవిర్భావ సందర్బంగా తెలంగాణా వారికి నా శుభాకాంక్షలు.
 
ఇక ఆంధ్రప్రదేశ్....... విచిత్రం ఏంటంటే... పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం... రాజధాని కూడా లేదు మరి.

లోటు బడ్జెట్టుతో మొదలై... రాజధాని సైతం పునాధులనుంచీ నిర్మించాల్సిన పరిస్థితి. ఇందుకు గల రాజకీయ కారణాలు, హేతు భద్దంగా లేని, అప్రజాస్వామిక విభజన ప్రహసనం గురించి ఇప్పుడు ఇంకా చర్చించు కోవడం అనవసరం అని నా ఉద్దేశం.

ఒక రాష్ట్రాన్ని రాజధాని సహితంగా పునాదుల స్థాయి నుంచీ నిర్మించడమంటే... అది జాతి నిర్మాణంతో (Nation Building) సమానం అని నా ఆలోచన. అది అంత సామాన్య మైన విషయం కాదు.

1947 లోమనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచీ మన దేశాన్ని స్వంతంగా నిర్మించుకొని, ఈరోజు ప్రపంచ ఆర్ధిక చిత్రపటంలో ఎన్నో దేశాలకు ధీటుగా స్థానం సంపాదించుకొన్నాం. దీనికి మనకు 60 సంవత్సరాలకు పైగా పట్టింది.

ఎందుకు 60 సంవత్సరాలు పట్టింది? కాంగ్రెస్ పరిపాలనా విధానాలు ఎంతవరకూ కారణం అన్నది చర్చించడం ఇప్పుడు నా అజెండా కాదు.

కానీ నేను చెప్పేదేమంటే, ప్రస్తుతం నూతన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 1947 నాటి పరిస్తితికన్నా అద్వాన్నం అని నా ఉద్దేశం. అందుకు కారణాలు

1.      రాజధాని లేదు... ఎక్కడో తెలీయదు...

2.      రాజధాని నిర్మానానికి ఎంతవుతుందో తెలీయదు... ఎంత సమయం పడుతుందో తెలీయదు.

3.      ఆర్ధిక పరిస్థితి  - లోటు బడ్జెట్.

4.      జాతీయతా భావం... జాతి సమగ్రతా భావం మనలో లేకపోవడం.

పై అన్నిటిలోనూ నాకు కనిపించే అతిముఖ్యమైన లోపం జాతీయతా భావం లేకపోవడం అనిపిస్తుంది.

ఒక కొత్త రాష్ట్రం సమగ్రంగా, అతి తక్కువ సమయంలో అభివృధిపథంలో నిర్మించబడాలంటే అది ఒక్క నాయకుడివల్ల సాధ్యపడే పని కాదు. ఎందరో ఎన్నో త్యాగాలు చేస్తేనేజాతి నిర్మాణం సాధ్యమవుతుంది, అది మనం చరిత్ర తిరగేస్తే తెలిసే సత్యం. కొన్ని అగ్ర దేశాలూ, రాష్ట్రాలను గమనిస్తే అర్థమయ్యే విషయం, సమిష్టి కృషి, నిస్వార్థ సేవ, త్యాగం, జాతీయ అభిమానం కనిపిస్తాయి.
ఉదాహరణకు Arizona (USA) లోని Hoover Dam గురించి Guided tour లో నేను తెలుసుకొన్న విశేషాలను మీతో పంచుకొంటాను.

 


 

 

Arizona మరియు Nevada రాష్ట్రాల మధ్య కొలరాడో నది పైన కట్టిన అద్భుతమైన ఆనకట్ట Hoover Dam. 1936 లో అనుకున్న దానికన్నా రెండు సంవత్సరాలకన్నా ముందు పూర్తీ చేసుకొంది. మూడు షిఫ్టుల్లో పని జరిగిందిట... షిఫ్టుకు యాభై సెంట్లు ప్రకారం కార్మికులకు ఇచ్చేవారంట.

ఇందులో విశేషం యంటి అనుకోవచ్చు, విశేషమేమేంటే, అమెరికా మిలటరీ రూల్ లో లేదు, కమ్యూనిస్ట్ డిక్టేటర్ రూల్ కూడా కాదు, పని వారిని నిర్భంధించి పని చేయించుకోడానికి, మరి అంతటి అద్భుత కట్టడం ఎలా సాధ్యమయ్యింది...
ఈరోజు Hoover Dam రిపబ్లికన్లు కట్టారా, లేక డెమోక్రాట్లు కట్టారా అనేదానికన్నా... అది అమెరికన్ల ఇంజినీరింగ్ అద్భుత విజయంగా చెప్పుకొంటారు. అంటే అది మొత్తం జాతి గొప్పతనం.... అలాగే Golden Gate Bridge ….ఇంకా ప్రతీ పెద్ద కట్టడం లొనూఆ జాతి గొప్పతనం కనపడుతుంది.
 

 
 

 



మన దేశంలో కూడా 1947 తరవాత అద్భుత కట్టడాలు జరిగాయి...  బాక్రనంగల్, నాగార్జున సాగర్, విద్యాసాగర్ సేతు... ఇలాంటివి ఇంకా ఎన్నో, అన్నిటిలోనూ మన జాతి గొప్పతనం కనపడుతుంది... నిస్వార్థ సేవ కనపడుతుంది, అది ఏపార్టీ కట్టిందో ఎవరూ మాట్లాడరు.












     

 



ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం అత్యంత వేగంగా జరగాల్సిన అవసరం ఉంది, అంటే రెట్టింపు శ్రద్ధ, దీక్షలు, జాతీయతా భావం అవసరం... లేదంటే ఒకటీ రెండు జనరేషన్లు బాధ పడవలసి వస్తుంది.
అంత మూల్యం చెల్లించటానికి మనం సిద్దమా?

1999 కన్నా ముందులేని సైబరాబాద్, మన యావత్ తెలుగు జాతికే గర్వకారణం. అదే సైబరాబాద్ లో ఉన్న IT కంపెనీ లో పని చేస్తూ..... అంతటి అభివృద్దిని ఆస్వాదిస్తూ.... దానికి మూల కారణమైన వ్యక్తిని... కులం కారణంగానో ఇంకో రాజకీయ కారణంగానో.... వ్యక్తి గౌరవం కూడా లేకుండా మాట్లాడే వాళ్ళు ఉన్న తెలుగు జాతి మనది.
అదే అభివృధి సూత్రంతో....కుల రాజకీయాల రొంపి నుంచి తమ రాష్ట్రాన్ని.... అభివృధి పథం లో నడిపించిన నాయకుణ్ణి మూడుసార్లు ముఖ్యమoత్రిగా ఎన్నుకొని... ఈరోజు దేశం లోనే 10% వృద్ధి రేటు తో దూసుకెళుతున్నారు గుజరాతీలు... దేశానికి ప్రధాన మంత్రిని కూడా ఇచ్చారు.
ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి నుంచి, అభివృధి పథంలోకి వచ్చి, దేశంలో గుజరాత్ లాంటి రాష్ట్రాలకు దీటుగా పోటీ పడే స్థాయికి రావాలంటే.... ప్రతీ నాయకుడు అధికారంలో ఉన్నా, లేకున్నా,  ప్రతీ మనిషీ, జాతి మొత్తం రాష్ట్ర నిర్మాణంలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఎతైనా ఉంది.

కానీ కొంతమంది నాయకుల మాటలు, వారి వ్యవహారం చూస్తూంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఎంత తొందరగా రాష్ట్ర నిర్మాణంలో విఫలముతాడో, అనెపంతో ఎంత త్వరగా అధికారం చేజిక్కిన్చుకొందాం అన్న ఆత్రమే కనపడుతోంది.

ఒక పార్టీ నాయకుడు, ఎన్నికలలో దరావతు కూడా రాణి వాడు అంటాడూ..., కొత్త ముఖ్యమంత్రికి కాళ్ళు వనుకుతున్నాయంట ప్రస్తుత పరిస్థితి చూసి...

కొత్తగా మోదటిసారి MLA అయిన ఒక మహిళా MLA అంటుందీ..... మమ్మీ నువ్వు మొదటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మెంబరు కదా అని ఫ్యూచర్ లో గర్వంగా చెప్పుకొంటదట ఆవిడ కూతురు.... వ్యక్తిగత విజయాలు సరే.... మరి ఇలాంటి వాళ్ళలో ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితేంటి? రాష్ట్ర నిర్మాణంలోమనం నిర్వహించవలసిన పాత్ర ఏంటి? అందులో మన భాగస్వామ్యం ఎంత ఉండాలి? అని ఆలోచించే వారు ఉన్నారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తమపైఉన్న భాద్యత రాజకీయాలకతీతం అని వీళ్ళు అనుకొంటున్నారా?

జాతి నిర్మాణంలో భాగమై, అభివృధి పథంలో నడిపించడానికి పడ్డ శ్రమ, అందులో ఉన్న గౌరవం, అది విలువ కట్టలేనిది అని ఎంత మంది అనుకొంటున్నారు?  అసలు అలా కూడా అనుకొంటారా? అలా అనుకొనే వాళ్ళు కూడా ఉన్నారా?


లేక ఎప్పటిలాగే..... తిన్నామా.... పడుకోన్నామా.... లేచామా.....
ఎదుటి వాడిదేకులం..... ఏ ప్రాంతం......

సాటి తెలుగు వాడు ఎలా పైకి వస్తున్నాడు...... వాన్నెలా కిందికి లాగాలీ........

ఇంతేనా మన జీవితం......

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను.........శ్రీశ్రీ

స్ఫూర్తి తో

ప్రతీ ఒక్క తెలుగు వాడూ.....
నేను సైతంతెలుగు జాతి నిర్మాణానికి నడుం భిగిస్తాను.......

అని అను కోవాలని ఆసిస్తూ............. సెలవు
 
ఇంత రాసావు మరి నువ్వేమిచేస్తావు? .........  అని ప్రశ్నించుకుంటే

నా సమాధానం

సంకల్పంతో చేసేవాడు ఉన్నాడు..... దేవుని అనుగ్రహంతో... అధికారం లో కూడా ఉన్నాడు
అడ్డు పుల్లలేయకుండా ఉందాం......

అదన్నా చెయ్యలేమా........... కనీసం.