Wednesday, August 29, 2018

Harikrishna


1982 రాజకీయ చైతన్యం ఉరకలువేసిన రోజులు, అది రామయ్య ప్రభంజనం.....

అందుకు దోహదపడ్డ అత్యంత ప్రధాన అంశం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన నిర్విఘ్నంగా, ఏకధాటిగా చేసిన అవిశ్రాంత యాత్ర... చైతన్యయాత్ర. అందుకు ఆయన ఎంచుకున్నరథం చైతన్యరథం.......సారథి మన క్రిష్ణయ్య... హరిక్రిష్ణ...

వందల ఏళ్ళ కాంగ్రెస్ నిరంకుశత్వాన్ని ధిక్కరిస్తూ ఆత్మగౌరవ నినాదంతో చైతన్యరథం ఎక్కి సాగించిన ప్రజాస్వామ్య సంగ్రామo.... ఆంధ్రదేశ చరిత్రలో మరిచిపోలేని... మరపురాని ఘట్టం....

రామయ్య రథానికి క్రిష్నయ్య సారథ్యం.........
చరిత్రకెక్కిన ఏరాజకీయ ప్రస్తానం లోనూ మనం చూడని అంశం....తండ్రి మొదలెట్టిన రాజకీయ ప్రస్థానo లో తనయుడు రథసారథ్యం వహించడం.... అధ్వితీయ, అనిర్వచనీయ, చిరస్మరణీయ ఆ అలుపెరుగని పాత్ర పోషించిన మన హరికృష్ణ ఎప్పటికీ మదిలో నిలిచిపోయి ఉంటారు.....సందేహమే లేదు.

బహుశా....
మన అన్నగారు తాను వెళ్ళిన లోకంలో మరో ప్రభంజనం శ్రుష్టించే ఆలోచనలో ఉన్నట్టున్నారు...మన క్రిష్ణయ్యకు పిలుపు అందినట్టుంది...అందుకేనేమో ఇంత అర్థాంతరంగా, అత్యవసరంగా తరలిపోయారు ఆ రామయ్యను కలవటానికి.

అంతే.... అంతే.... అంతేఅయ్యుంటుంది....అదే మీ అభీష్టం అనుకొంటూ...

మీ ఆత్మకు శాంతిచేకూరి త్వరగా ఆ రామయ్యని చేరుకోవాలని...ఆ లోకాలలో మన రామయ్య శ్రుష్టించే ప్రభంజనాలలో ఆయన రథానికి మీరే సారధ్యం వహించాలని ఆశిస్తూ...


ఎన్నివసంతాలైనా... చెక్కుచెదరని అభిమానంతో ఓ తెలుగుదేశం అభిమాని....