Wednesday, December 13, 2017

లేరు మీకెవ్వరు.....సరి.... దాసరి...

లేరు మీకెవ్వరు.....సరి.... దాసరి...
దర్శకరత్నం.....ఆహా... ఈ అలంకారం...మీకే.. సరి..... .దాసరి..
తూగగల తెలుగు దర్శకులు లేరు.... సరి.......దాసరి...
తెలుగు చలనచిత్ర ప్రపంచానికి ...సరి.... సిరి.... దాసరి....

1980....
సర్దార్ పాపారాయుడు............జైలు గేటు నుంచి బయటికి వచ్చిన NTR అలా వెనక్కుతిరిగి పైన ఉన్న జాతీయ పతాకాన్ని చూస్తే.....ఇప్పటికీ ఉరకలేస్తుంది ఒంట్లో రక్తం....... అది...దాసరి.....

1982.... నేను 8వ తరగతి

బొబ్బిలి పులి....... మైండు బ్లోయింగ్...... అనంతపురం.....త్రివేణి.... జన సంద్రం అంటే ఏమిటో తెలిసింది.... అది...దాసరి....
అప్పుడప్పుడే సినిమాలపై పెరుగుతున్న ఊహ.....అవగాహన.....ఆ టైములో.....మీరు ఈ రెండు సినిమాలతో నా మనసుపై వేసిన ముద్ర... ఎప్పటికీ చెరగదు.....

ఆ తరవాత ఎందుకో కానీ “లంచావతారం” తో మీరు నన్ను చాలా రోజులేవెంటాడారు.... బహుశా ఆ సినిమా లో మీ గెటప్పు కావచ్చు.... మీ వినూత్న డైలాగ్ డేలివేరీ కావచ్చు.......అభిమానం మొదలైయ్యింది.....
సినిమాలపైన మంచి అవగాహన వచ్చాక.....సర్దార్ పాపారాయుడు..... బొబ్బిలి పులి..... శ్రుష్టించింది ఈ లంచావతారమే ....అని తెలిసాక.... మీపై అభిమానం.....ద్విగునీకృతం.......
...
శివరంజని.......
అభినవతారవో.....నా అభిమాన తారవో.....అభినయ.... రసమయ కాంతి ధారవో.....
ఎంతమంది అభిమానులు తమ అబిమాన తారామణులను తలచుకున్నారో.....అంతే అందంగా ఈ పాటతో.... ఆ సినిమా తో....
...
స్వయంవరం………..
గాలి వానలో.... వాన నీటిలో....పడవ ప్రయాణం..... రేడియోలో చేసిన హోరు... ఇప్పటికీ జ్ఞాపకమే... ఇప్పటి తరాన్నీ ఎన్నో విదాలుగా ఎంటర్టైన్ చేస్తున్న(ఎన్నో పేరడీలు, కామెడీలు వస్తూనే ఉన్నాయ్ ఇంకా) ఈ మీ పాట... చిరస్మరణీయo....
...
మేఘ సందేశం.......
ఆకాశ దేశానా...ఆషాఢ మాసానా....మెరిసేటి ఓ మేఘమా... మెరిసేటి ఓ మేఘమా....విరహమా.. దాహమా....విడలేని మోహమో... వినిపించు నాచెలికీ.... మేఘసందేశం...... మేఘసందేశం...
ఎంతమంది భగ్న ప్రేమికుల హృదయాలను చదివి తీయగలిగారు ఈ పాట......
...
గోరింటాకు......
మాయాబజార్..... దేవత....లో సావిత్రి గారిని చూసిన కళ్ళతో..... గోరింటాకు చూసిన ప్రతిసారీ.... కళ్ళు చెమర్చిన జ్ఞాపకాలు....ఇలా ఎంతమందో.....
....
కథ కథనం లో... తరవాత్తర్వాత వచ్చిన ఆధునికత తో... మీరు విజయాల పరంగా కొంత వెనకపడి ఉండవచ్చు గాక... కానీ అంతలోనే.... సినీ ప్రపంచం ఉలికిపాటు పడే విజయం.....
...
ఒసే రాములమ్మ..........
.....
....
యవ్వనంలో మీకున్న సామాజిక స్పృహ... దాన్ని సిల్వర్ స్క్రీనుపై ఆవిష్కరించే మీ నేర్పు.... ప్రస్తుత ఆధునిక సాంకేతికతతో సినిమాలో చేస్తున్న ప్రయోగాలకు తోడైతే జరిగే అద్భుతాలు.... ఉహాతీతం.....
అందుకే.....
ఇప్పుడు వెళ్లి..... ఆకాశ దేశంలో విహరించి... విశ్రాంతి తీసుకొని.....
నూత్న యవ్వనంతో మరిన్ని ఆలోచనలతో.....తొందరగా....
మళ్ళీ అదే దాసరి గా
రావాలని......కోరుకొంటూ...ఇప్పటికి.....సెలవు....
మళ్ళీ రండి.....నారాయణరావు గారు....
దా....దా....దా....’దా సరి’లేరు నీకెవ్వరు.....

--------------------------------*****-------------------------------------

(దాసరి గారు పరలోక పయనమైన రోజున నా ఈ పోస్ట్.......)