Saturday, December 3, 2016

ఎవరయ్యా ఈ cm?


ఎవరయ్యా ఈ cm?

ఎక్కడ ఉంటాడు రా ఈ cm?

ఎక్కడ వెతకాలి ఈ cm ను?



 ఏంటి రా నీ గోల....... ఎ cm కావాలి నీకు? తెలంగాణా cmఆ? ఆంధ్ర cmఆ?

ఎహే వాల్లు కాదు.....

మరి ఇంకే స్టేట్ cm కావలి నీకు, మన దేశం లో 29 స్టేట్లు ఉన్నాయి, ఏ స్టేట్ cm కావలి నీకు?

ఏయ్.... cm అంటే చీఫ్ మినిస్టర్(chief minister) కాదు, కామాన్ మాన్ (common man).... కామాన్ మాన్...

ఏంటీ.... కామాన్ మానా?...... కామాన్ మాన్ కనిపించటంలేదా నీకు.

ఎక్కడయ్య.... కామాన్ మాన్.... అది కనపడకుండా నే కదా నేను వెదుకుతున్నది.

ఎహే... కామాన్ మాన్ కనపడక పోవడమేంటి.... అదిగో ఆ SBI బ్యాంకు ముందు లైన్ లో ఉన్నారే వాళ్ళంతా కామాన్ మాన్లే.

నేనూ కామాన్ మాన్నే...... అంతెందుకు నువ్వు కూడా కామాన్ మాన్న్వే......

భలేవాడివే మనమంతా కామాన్ మాన్లమే?  ముందు నేను కూడా అలానే అనుకొనే వాడిని, ఈమధ్యే డౌట్ వస్తోంది... నేను కామాన్ మాన్నా?..... అని

ఎందుకంటే ఈమధ్య పేపర్ లలో, tv చానళ్లలో అంతా కామాన్ మాన్ చాలా కష్టపడుతున్నాడు...గంటల కొద్ది లైన్లు లో నిలపడి, తిండి లేక, ఎండలో అల్లాడి పోతున్నాడు అని ఒకటే దంచేస్తున్నారు....

కొన్ని న్యూస్ పేపర్ లలో ఎడిటోరియల్ ల మీద ఎడిటోరియల్ల్లు రాస్తున్నారు.....ఈ కామాన్ మాన్ కష్టాల గురించి....

... అందుకే అర్థం కాక... ఈ మీడియా వాళ్ళు... కొంతమంది రాజకీయ నాయకులు..... ఇంకా కొంత మంది సోషల్ నెట్వర్క్ సమాజ సుదారకులు... చెపుతున్న కామాన్ మాన్ ఎవరో తెలుసుకొందామని బయలుదేరా.....



టెర్రరిస్టులు బాంబులు పెడితే చచ్చే వాళ్ళలో ఉంటారా ఈ కామాన్ మాన్లు......... అలా తమ వారిని కోల్పోయి జీవితకాలం పాటు రోదించేవాళ్ళలో..... ఉంటారా ఈ కామాన్ మాన్లు?

నల్లదనం వల్ల దేశంలో నెలకొని ఉన్న ఆర్ధిక అసమానతల వల్ల ఎన్నో అవకాశాలను కోల్పోతూ జీవిత కాలంపాటు సత మవుతూ భతికే వాళ్ళల్లో ఉన్నారా ఈ కామాన్ మాన్లు....

మన ప్రస్తుత నల్లధన రాజకీయ విన్యాసంలో తమ తలరాతలు ఏ ఐదేళ్ళ టర్మ్ కు ఎలా మారుతాయో తెలీకుండా.. అయోమయంగా....బతికేసే వాళ్ళలో ఉంటారా ఈ కామాన్ మాన్లు......

కాన్ మాన్ గురించి తెగ భాధ పాడేవాళ్ళ ఉద్దేశ్యం....... నోట్ల కష్టాలు తీరి అందుకు ఉద్దేశించిన ఫలితం వచ్చి కామన్ మాన్ కు మంచి కాలం రావాలనా.... లేక అది ఖచ్చితంగా విఫలమై...... ప్రస్తుతం ఉన్న పరిస్థితి కొనసాగి... వీలైతే ఇంకాస్త ముదిరి.....అలా గడిచిపోవాలనా......

అది అలా గడిచిపోతే నే కదా తాము నిర్మించుకున్న దొంగ సామ్రాజ్యాలు వర్దిల్లేది.......



ఒకడు అంటాడూ భారత దేశంలో డిజిటల్ లావాదేవీలు సాధ్యమా....... మనది ఇంకా అభివృధి చెందుతూన్న దేశం.... గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు బ్యాంకు ఎకౌంటు ఉండవు.... అంటాడు..... మరి నోట్ల రద్దుసందర్భంగా అన్నా అందరూ బ్యాంకు ఖాతాలు తప్పనిసరిగా తెరుచుకుంటే మంచిదేకదా...... లేక ఇంకో శాతాబ్ధమైనా అభివృధి చెందుతూన్న దేశంగా నే ఉండాలేమో మరి.......

 నోట్ల రద్దుతో లంచాలు తగ్గుతాయా?.... లంచాలు తీసుకొనేవాడు... స్వైప్ మెషీన్ వాడతాడు డబ్బు తీసుకోడానికి.... తప్పుడు ఎకౌంటు ద్వారా....... అంటాడు ఇంకోడు...... ఎంత తప్పుడు ఎకౌంటు అయినా, స్వైప్ మెషీన్ వాడాడు అంటే ఎదో ఒక ఎకౌంటు కు కలపాలి కదా మరి అది ట్రాక్ చేయ్యచ్చుకదా.... అది మరి ప్రస్తుత పరిస్తితికన్నా మేలేకదా.... ఎంత మంది స్వైప్ మెషీన్లు వాడి తప్పుడు అకౌంట్లు నిర్వహించగలరో మరి వీరే చెప్పాలి.......



ఒక వైపు కామన్ మాన్ లైన్లలో నుంచొని ఒకటీ రెండు నోట్లు మార్చుకోడానికి కష్టపడుతూ ఉంటె, ఇంకో వైపు కట్టలు కట్టలు కొత్త నోట్లు కొంత మంది దగ్గర బయట పడుతూ ఉన్న వార్తలు చూస్తున్నాము....... ఇల్లాంటి వి చూపించి నోట్ల రద్దు ప్రక్రియ అంతా విఫలం అంటున్నారు మన వీరులు...... మరి అక్రమార్కులు బయట పడితే మంచిదే కదా..... నోట్ల రద్దు ఉద్దేశమే అక్రమార్కులను కట్టడి చెయ్యటం అయితే మరి అది కొంత వరకూ ఫలితమిస్తూందని సంతోషపడక పోవడం అంటే ఏంటి? ..... తమ సాటి అక్రమార్కుడు పట్టు పడ్డాడని భాధా........



1.25 బిలియన్ల జనాభా ఉన్న దేశంలో యేపతకమైనా దాని అమలులో కొంత వరకూ తప్పులు దోర్లచ్చు..... వాటిని అధిగమించే సూచనలు చెప్పే ప్రయత్నం చెయ్య కుండా....... ఎలాగైనా దీన్నివిఫలం చేసి..... అదేపనిగా కామన్ మాన్ అష్ట కష్టాలు పడుతున్నాడని చెప్పిందే పదే పదే చెప్పి... అవునేమో ఇదంతా తనని కష్టాల పాలు చెయ్యడానికే అని కామన్ మాన్  బ్రెయిన్ వాష్ చేసి ఎలాగైనా తమ నల్ల సామ్రాజ్యం పచ్చగా పదికాలాల పాటు తర తరాలు వర్ధిల్లాలని తెగ ఆయాస పడుతూన్నట్లుగా ఉంది తప్ప....... ఇంకో కోణం నాకైతే కనిపించడం లేదు.......ప్రస్తుతం జరుగుతుండేది చూస్తూంటే.

ఏదేమైనా కామన్ మాన్ తరఫున పోరాడే వీరులు... వీర నారీలు..... ఇంతమంది ఉన్నారని తెలిసి..... ఆనందమే... ఆనందం....నాకు.......

ఈమధ్య ఒక న్యూస్ చదివా...... ఏది ఎక్కడ ఎలా ఉన్నా.... కాష్మీర్లో పరిస్థితి మాత్రం... శాంతి యుతంగా ఉంది అని.... రోడ్లలో రాళ్ళ వర్షాలు లేక దుకాణాలు తెరుచుకున్నాయి అని...... అంటే మరి ఈ దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరిగిందన్నమాట......మరి మన కామన్ మాన్ తరఫు వకాల్తా తీసుకున్న వాళ్లకు ఇది మంచిదో కాదో మరి.....



ఒక రాజకీయ వాదికి.... ఒక పార్టీకి భక్తుడు కానవసరం లేదు..... యే పతకమైనా.... దాని ఉద్దేశం..... మంచిదైతే చాలదా.......దానికి మద్దతుగా నిలవడటానికి..........



జనాన్ని పోగేసుకొని ఉప్పర మీటింగులు....ఎట్టుకొని...... సింగపూరులో అల్లా అంటా..... అమెరికాలో ఇలా అంటా..... అని సొల్లు కబుర్లు చెప్తూ..... ఇంకో పక్క......సొంత దేశం మాత్రం శతాబ్దాల పాటు అభివృధి చెందుతూ...తూ...తూ....తూ...తూ...తూనే.....ఉండాలి...... అంతేకదా..... మరీ ఏదన్న మారిపోతే .....ఎలా..... కష్టపడిపోమూ........



ఇంత మంది..... వీరులు తమగురించి భాధ పడిపోతూ....పోరాడుతూంటే.... అదేమీ పట్టకుండా.....ఇది తమ భాద్యతగా.... నిశ్యబ్ధంగా.........కొత్తనోటు కోసం లైనులో ఓపికగా నిల్చున్న ప్రతీ కామన్  మాన్ కూ.....జోహార్......




****************************************************








అనంత్ శ్రీరామ్..... too good.......



----------------------------------------------------------------------------------------------------------------
మనం ఎవరినన్నా తిట్టాలంటే ఏమంటాము.... మనిషివా పశువ్వా అని కదా..... ఇది చూసిన తరవాత నాకనిపించింది.......ముందు ముందు మనం.......... మనిషివా JNU జంతువువా అని అనటానికి ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు.