Wednesday, December 13, 2017

లేరు మీకెవ్వరు.....సరి.... దాసరి...

లేరు మీకెవ్వరు.....సరి.... దాసరి...
దర్శకరత్నం.....ఆహా... ఈ అలంకారం...మీకే.. సరి..... .దాసరి..
తూగగల తెలుగు దర్శకులు లేరు.... సరి.......దాసరి...
తెలుగు చలనచిత్ర ప్రపంచానికి ...సరి.... సిరి.... దాసరి....

1980....
సర్దార్ పాపారాయుడు............జైలు గేటు నుంచి బయటికి వచ్చిన NTR అలా వెనక్కుతిరిగి పైన ఉన్న జాతీయ పతాకాన్ని చూస్తే.....ఇప్పటికీ ఉరకలేస్తుంది ఒంట్లో రక్తం....... అది...దాసరి.....

1982.... నేను 8వ తరగతి

బొబ్బిలి పులి....... మైండు బ్లోయింగ్...... అనంతపురం.....త్రివేణి.... జన సంద్రం అంటే ఏమిటో తెలిసింది.... అది...దాసరి....
అప్పుడప్పుడే సినిమాలపై పెరుగుతున్న ఊహ.....అవగాహన.....ఆ టైములో.....మీరు ఈ రెండు సినిమాలతో నా మనసుపై వేసిన ముద్ర... ఎప్పటికీ చెరగదు.....

ఆ తరవాత ఎందుకో కానీ “లంచావతారం” తో మీరు నన్ను చాలా రోజులేవెంటాడారు.... బహుశా ఆ సినిమా లో మీ గెటప్పు కావచ్చు.... మీ వినూత్న డైలాగ్ డేలివేరీ కావచ్చు.......అభిమానం మొదలైయ్యింది.....
సినిమాలపైన మంచి అవగాహన వచ్చాక.....సర్దార్ పాపారాయుడు..... బొబ్బిలి పులి..... శ్రుష్టించింది ఈ లంచావతారమే ....అని తెలిసాక.... మీపై అభిమానం.....ద్విగునీకృతం.......
...
శివరంజని.......
అభినవతారవో.....నా అభిమాన తారవో.....అభినయ.... రసమయ కాంతి ధారవో.....
ఎంతమంది అభిమానులు తమ అబిమాన తారామణులను తలచుకున్నారో.....అంతే అందంగా ఈ పాటతో.... ఆ సినిమా తో....
...
స్వయంవరం………..
గాలి వానలో.... వాన నీటిలో....పడవ ప్రయాణం..... రేడియోలో చేసిన హోరు... ఇప్పటికీ జ్ఞాపకమే... ఇప్పటి తరాన్నీ ఎన్నో విదాలుగా ఎంటర్టైన్ చేస్తున్న(ఎన్నో పేరడీలు, కామెడీలు వస్తూనే ఉన్నాయ్ ఇంకా) ఈ మీ పాట... చిరస్మరణీయo....
...
మేఘ సందేశం.......
ఆకాశ దేశానా...ఆషాఢ మాసానా....మెరిసేటి ఓ మేఘమా... మెరిసేటి ఓ మేఘమా....విరహమా.. దాహమా....విడలేని మోహమో... వినిపించు నాచెలికీ.... మేఘసందేశం...... మేఘసందేశం...
ఎంతమంది భగ్న ప్రేమికుల హృదయాలను చదివి తీయగలిగారు ఈ పాట......
...
గోరింటాకు......
మాయాబజార్..... దేవత....లో సావిత్రి గారిని చూసిన కళ్ళతో..... గోరింటాకు చూసిన ప్రతిసారీ.... కళ్ళు చెమర్చిన జ్ఞాపకాలు....ఇలా ఎంతమందో.....
....
కథ కథనం లో... తరవాత్తర్వాత వచ్చిన ఆధునికత తో... మీరు విజయాల పరంగా కొంత వెనకపడి ఉండవచ్చు గాక... కానీ అంతలోనే.... సినీ ప్రపంచం ఉలికిపాటు పడే విజయం.....
...
ఒసే రాములమ్మ..........
.....
....
యవ్వనంలో మీకున్న సామాజిక స్పృహ... దాన్ని సిల్వర్ స్క్రీనుపై ఆవిష్కరించే మీ నేర్పు.... ప్రస్తుత ఆధునిక సాంకేతికతతో సినిమాలో చేస్తున్న ప్రయోగాలకు తోడైతే జరిగే అద్భుతాలు.... ఉహాతీతం.....
అందుకే.....
ఇప్పుడు వెళ్లి..... ఆకాశ దేశంలో విహరించి... విశ్రాంతి తీసుకొని.....
నూత్న యవ్వనంతో మరిన్ని ఆలోచనలతో.....తొందరగా....
మళ్ళీ అదే దాసరి గా
రావాలని......కోరుకొంటూ...ఇప్పటికి.....సెలవు....
మళ్ళీ రండి.....నారాయణరావు గారు....
దా....దా....దా....’దా సరి’లేరు నీకెవ్వరు.....

--------------------------------*****-------------------------------------

(దాసరి గారు పరలోక పయనమైన రోజున నా ఈ పోస్ట్.......)

Sunday, April 30, 2017

ఆది శంకరాచార్యా..... ప్రణామం....



ప్రణామం........ప్రణామం.....ప్రణామం......
ఆది శంకరాచార్యా.....  ప్రణామం....
జగత్ గురువా....... ప్రణామం.......
బ్రహ్మ జ్ఞానీ..... ప్రణామం........
అద్వైతం.....ప్రభోధం...... ప్రణామం....
ధర్మ పునరుజ్జీవన పితామహా..... ప్రణామం.....

గీతోపదేశం పై భాష్యంతో మమ్ములను అజ్ఞానాందకారo నుంచి కాపాడిన... తేజోమయీ..... ప్రణామం......
భజగోవిందo ....సౌందర్యలహరి.....శివానoదలహరి.... ఆనంద లహరులలో విహరిoపచేసిన విరించీ... ప్రణామం....

ముప్పది వసంతాల యవ్వన వయస్సులోనే మీరు సాధించిన జైత్రయాత్రలకు....ప్రణామం.......

అఖండ భారతావనికి మీ జైత్రయాత్రల స్ఫూర్తి మళ్ళీ అవసరమైన సమయం ఆసన్నమైనది...
ఆధ్యాత్మికం అణువంతఅయినా కానరాని ఈ అధునాతనం లో మళ్ళీ..... సనాతనాన్ని తట్టి లేపగల సత్తా మీ ఒక్కరికే ఉందని.....మీ ఆగమనం కోసం ఎదురుచూసే........అశేష వాహినిలో ఒక......భక్తుడు.

హర హర మహాదేవ శంభో శంకర...ప్రణామం...ప్రణామం...ప్రణామం...



ఆదిశంకరుల జన్మదినo సందర్భంగా నా మనసులోని భావాలతో......

Saturday, April 8, 2017

సినిమా ఓ సినిమా..........చెలియా.......

సినిమా ఓ సినిమా..........చెలియా.......
ముఖ్యంగా మన తెలుగు సినిమాకు పట్టిన దరిద్రాలలో ....పైరసీ దారిద్య్రం, భావదారిద్య్రం, రివ్యూ దారిద్య్రం....... ముఖ్యమైనవి.

అంతులేని, అంతుచిక్కని ప్రస్తుత ఆధునిక టెక్నాలజీతో...పైరసీని అరికట్టడం సినిమా సినిమాకూ పెరుగుతున్న చాలెంజ్, ప్రస్తుతానికి ఇది మన పరిధిలో లేని విషయం అని పక్కన పెట్టి ... కొంచం తీరిగ్గా దీని గురించి తరవాత చర్చిద్దాం.

ఇకపోతే భావదారిద్య్రం.... ఇది రెండుపక్కలనుంచీనూ.....ఇండస్ట్రీ.... ప్రేక్షకుడు......

నాఅభిప్రాయం ఏంటంటే మన తెలుగు ప్రేక్షకుడి అభిరుచి.... అవగాహనా అన్నీ ఒక పథకం ప్రకారం శృతి చేయ్యపడ్డాయి అని......
మన సగటు ప్రేక్షకుడికి ప్రేమ కథ సినిమా అనగానే ......ఎందుకూ పనికిరాని ఓ పోరంబోకు... వీధి చివర అడ్డాలో ఇంకో నలుగురు పోరంబోకులనేసుకొని..... పరిచయ సన్నివేశంలో మదర్ థెరిసా భావాలతో సమాజాన్ని ఉద్ధరించే పనిలో ఆసాంతం నిమఘ్నమైపోయిన మన కథానాయకిని చూసి పరవశించిపోయి..... పక్కనున్న తొట్టి గాంగ్ లో ఒకడు వెకిలి జోకు వేస్తే వాడి చంప పడేల్ మనిపిస్తే..... కూర్చున్న కుర్చీలోంచి కింద పడిపోయేన్తగా మనం నవ్వేసి....
తరవాత వచ్చే సీనులో.... మన పోరంబోకు హీరో వేసే విచిత్రమైన పథకానికి పడిపోయి ప్రపంచంలో తననుమించిన బుద్ధిశాలి లేరని నిరూపించుకొంటుంది మన హీరొయిన్..... వెంటనే ఒంటిమీద ఎంతవరకూ దుస్తులు ఉన్నాయో అన్న స్పృహ లేకుండా గెంతితే..... ఆ మధుర దృశ్యాన్నే ఊహించుకుంటూ ఉన్నంత లోనే వచ్చే ఒక అధ్బుత మలుపు లో.... తెలుగు ప్రేక్షకుడికి హాస్యాన్ని పరిచయం చేసిన కామెడీ బ్రహ్మని తానే.... అని వచ్చిన తడవుగా లొడ లొడా వాగితే.... నాసామిరంగా... పొట్ట చెక్క లయ్యేట్టు నవ్వేసేలోపలే వచ్చేసే క్లైమాక్సు లో...... ప్రపంచం లోనే అత్యంత దీనమైన వెధవ అయిన తెలుగు సినిమా హీరొయిన్ తండ్రికి... అంత వరకూ జీవితంలో ఒక్క పనికొచ్చే పని చెయ్యనిమన పోరంబోకు హీరో చేసే హితభోధతో మనం కూడా జ్ఞానోదయం కలిగిన ఫీలింగుతో... చమర్చిన కళ్ళ రెప్పలు చిన్నగా మూస్తూ తెరుస్తూ.. అలా శుభం కార్డు వైపు చూస్తూ.... అప్పుడే అయిపోయిందా అని..... దిగాలుతో...థియేటరు బయటికి వస్తే...... అది ప్రేమకథ సినిమా అంటే.....

 భావదారిద్య్రం పెద్ద విషయం కాదు... ఎందుకంటె... పాపం అప్పుడప్పుడూ... రోటీనుకు భిన్నంగా ఇండస్ట్రీ నుంచి మంచి చిత్రాలు వస్తూన్నాయి..... ప్రేక్షకుడూ వాటిని అమితంగా ఆధరిస్తున్నాడు..... ఏవో ఎక్కడో మంచి ప్రణాళిక లేకుండా వస్తే తప్ప.......

ఇకపోతే ఈ రివ్యూ దారిద్య్రం ఉంది చూసారూ...సినిమాకు పట్టిన కొత్త దారిద్య్రం...కొత్తగా వచ్చిన ఈ సోషల్ నెట్టువర్కులూ.... ఏదో అంతర్ ఉద్దేశం తో నడిచే నియమ నిబద్ధతలు లేని కొన్ని వెబ్ సైటులతో సినిమాకు జరుగుతున్న నష్టం చలా ఎక్కువ అని నా అభిప్రాయం, ఎందుకంటే దరిద్రపు రాతల ఆధారంగా సినిమా వెళదామా వద్దా అని మన ప్రేక్షకుడు.....తన్నుకుంటూ ఉన్నాడు....

చాలా రోజుల తరవాత...మొత్తంగా.... అన్ని పాటలూ...చాలా బాగా నచ్చేసిన ఆల్బం... చెలియా.....సినిమా ఎప్పుడా అని ఎంతో ఎడురుచూసేట్టు చేసిన ఆల్బం.....

నిన్న రాత్రి ఆటకు వెళ్లి వచ్చాము..... వీకెండ్ కదా...పొద్దున్నే మన తెలుగు పత్రికలు తిరగేయడం మెదలుపెడితే.... ఇంకేముంది మన బుర్ర చేడదొబ్బెయ్యకుండా వదలరు కదా......
ఒకడి హెడ్డింగు........ “Review: Boring and Tedious”
Rating: 2/5
చివరగా ...... “Bottom-line: Himsaaro!”
ఇది........
యీతడు ఈ మధ్య వచ్చిన ఫక్తు మసాలాలకు ఇచిన రేటింగు దేనికీ 3/5 కు తక్కువ లేదు......
ఈ బొంద రివ్యూ మధ్యలో సినిమాలోని సీనుల గురించి వీడి అభిప్రాయం.........

మొత్తం చదివితే అర్ధం అయ్యేదేందంటే...... ఈ రివ్యూ రాసిన వాడికి అది ఏ జోనర్ (Genre) సినిమా నో అసలు తెలిసి రాస్తున్నాడా..... లేకుంటే..... మన రోడ్ద కొట్టుడు సినిమా చూసి యిలా తయారయ్యడా..... అర్థం కాక BP వచ్చింది.....

భాదేంటంటే.... ఈ చెత్త చదివి.... వీళ్ళు రాసే చెత్త అభిప్రాయం చదివి సినిమా థియేటర్ వరకూ వెళ్ళకుండా ఆగిపోయే మన ప్రేక్షకుని పరిస్థితి.......సినిమా పరిస్థితి........?????
కొన్ని రివ్యూ లలో మొత్తం కథంతా రాసేసి వీళ్ళ బోడి జడ్జిమెంటులూ రాసేస్తున్నారు....... యిలా రాసే వాడికున్న సినిమా పరిజ్ఞానమేంటి........ వాడేంటి...... వాడి....బొందేంటి......

సినిమా ను సినిమాగా ప్రేమించే వాడు ఇలాంటి వాళ్ళ రాతల తో ఆగిపోకుండా థియేటర్ వరకూ నడవాలని కొరుకునే వాళ్ళలో నేనూ ఒకడిని...... అందుకే ఇలాంటి రాతగాల్ల బారిన పడి ఏ మంచి సినిమా నలిగి పోకూడదని ఆశిస్తున్నా.
ఒక వంద కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ సినిమా గురించి డిస్కషన్స్ పెట్టి సినిమా అంటే ఎన్నో కుటుంబాలు ఆధార పడి ఉంటాయి... అదీ ... ఇదీ... అని కబుర్లు చేప్తూంటారు... కరక్టే.... ఎవరూ ఫెయిల్ అయ్యే సినిమా తీయాలని కోరుకోరు.... మరిఅన్ని కోట్లు ఖర్చుపెట్టినప్పుడు.....కొంచం కంటెంట్ మీద జాగ్రత్తలు తీసుకోకుండా.... మసాలా దట్టిస్తే సరిపోతుందిలే అనుకోవడం ఎంతవరకూ కరెక్ట్???....
పంట లాభ సాటిగా ఉండాలని గంజాయి నాటి వ్యాపారం చేస్తాం అంటే కుదరదు కదా.......

నా మట్టుకు నాకు.... సినిమా అంటే సినిమా అంతే..... పాత్రలు మాట్లాడే భాషను బట్టీ.... అది తెలుగు సినిమా... తమిళ్ సినిమా.... మళయాళ సినిమా..... బెంగాలీ సినిమా అన్న తేడా లేదు...... పిచ్చికి కూడా భాష ఉంటుందా చెప్పండి......అది......సినిమా అయితే చాలు చూసేద్దాం.......అదీ పాలసీ.......

కాబట్టి సినిమా చూడాలనిపిస్తే థియేటర్ లో చూసేయ్యడమే... ..... సినిమా అంటే ఎంటో తెలీయని ప్రతీవాడు చెప్పే దాన్ని ఆధారంగా సినిమా చూడటం మానకూడదు.....

యీ భావదారిద్యం రివ్యూ ల మీద ఆధారపడితే...... ఎప్పుడో ఒకసారి వచ్చే మరో శంకరాభరణం, మన అదృష్టం బాగుండి వచ్చే మరో సాగరసంగమం, ఎన్నో అంతులేని కథలు.... ఎన్నో మరో చరిత్రలూ...... మిస్ అయిపోమూ....

మోనాలిసా నవ్వు లోని అందాన్ని ఆస్వాదించి ఆనందించాలి.... అంతే..... చిత్రపటం లో ఉన్న లోపాలు చూస్తూ అందాన్ని ఆనందించకుండా వదిలేస్తే అది అవివేకం.....

మని సర్ కోసం ఒక రౌండ్ అయ్యింది.....
త్వరలో......కార్తి కోసం ఒక రౌండ్......
రెహమాన్ సర్ కోసం ఇంకో రౌండ్.....
దృశ్యాన్ని..... కావ్యంగా...... ఆవిష్కరించే మాస్టర్ ఒకరు....
ఆదృశ్య కావ్యాన్ని.... శ్రవనానందభరితం చేస్తూ... మరో స్థాయికి తీసుకెళ్ళే మాస్టర్ మరొకరు.....
వీరిద్దరి కలయిక మరీ మరీ జరుగుతూ ఉండాలని కోరుకొనే......….. ఓ సినీ పిపాసి........
నేషనల్ అవార్డులు గెలిచిన పెళ్లి చూపులు, శతమానంభవతి చిత్ర యూనిట్లకు, విజేతలుగా నిలచిన అన్ని సినిమా యూనిట్లకు శుభాకాంక్షలు.....

గమనిక: ఇది నా అభిప్రాయం....... సానుకూలంగా.... మంచి దృక్పథం తో చేసే నిర్మాణాత్మక కామెంట్లకు ఎప్పుడూ స్వాగతం....