ఈ మధ్య ఫేస్ బుక్ లో ఒక
పోస్ట్ చూసాను... చాలా టచ్చింగ్ గా ఉంటుంది.
ఫాదర్స్ డే సందర్భంగా
అందరికోసం మరొక్క సారి.....
My promise to my children - as long as I live I am your
parent 1st, your friend 2nd.
I will stalk you, flip out on you, lecture you, drive you
insane, be your worst nightmare and hunt you down like a bloodhound when needed
because I LOVE YOU!
When you understand that I will know you are a responsible
adult. You will NEVER find someone who loves, prays, cares & worries about
you more than I do! If you don’t hate me once in your life – I am not doing my
job properly.
చదువుతున్న ప్రతీసారి ఎంత
నిజముంది అందులో...ప్రతీ నాన్నా అలాగే
ఉంటారా... అనిపించింది నాకు.
మా నాన్న మాత్రం నాకు అలాగే
అనిపిస్తారు.
అవును...నేను ఆయనను హేట్
చేసాను.. ఒక్క సారి కాదు చాల సార్లు... సైకిల్ కొనివ్వలేదని, ప్యాంటు కాకుండా
నిక్కర్లు కుట్టించారని, పైసలు సరిపడా ఇవ్వలేదని... అదనీ...ఇదనీ...ఇంకేదో అని.....
పిల్ల తనం, మూర్ఖత్వం, అమాయకత్వం, మొండితనం ఏదన్నా కావచ్చు....
కానీ నేను ఇప్పుడు ఉన్న
స్థితికి మా నాన్నే కారణం, ఆయన ఆ రోజు అలా ఉన్నారు కాబట్టే నేను ఈరోజు ఇలాఉన్నాను,
ఆయన అలా కాక విచ్చల విడితనంగా అడిగినదంతా ఇచ్చి ఉంటే నేను ఈరోజు ఎలా ఉండేవాడినో
చెప్పలేను కానీ ఈస్తితికి మాత్రం వచ్చిఉండేవాడిని కాదు అనిమాత్రం ఘంటాపథంగా
చెప్పగలను.
నా డిగ్రీ తరవాతే మా నాన్న ఎంత కరెక్టో తెలిసి
రావడం మొదలయ్యింది.
డిగ్రీ అయినతర్వాత
హైదరాబాద్ లో గాంధీ నగర్లో ఫ్రెండ్స్ తో పాటు రూంలో ఉండి సివిల్ సర్వీసెస్ కు(UPSC) చదివే
వాడిని, నా మొదటి ప్రయత్నం లోనే సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయ్యాను... ఎమి చేస్తాం
మన రైటింగ్ బాడ్, మెయిన్స్ లో అదే దెబ్బ కొట్టింది.... కానీ ఇప్పటికీ నేను గర్వ
పడే విషయం అది, ఎందుకంటె ప్రతీ ఏడు దేశం మొత్తం కేవలం పదివేలమంది ప్రిలిమ్స్
క్లియర్ చేసేవారు అప్పట్లో, ఉన్న నాలుగు ప్రయత్నాలూ ముగించుకొని ఒక్క సారి కూడా
కేవలం ప్రిలిమ్స్ పాస్ కాకుండా పెట్ట సర్దుకొని ఊరు వెళ్ళే వాళ్ళు ఎంత మందో ప్రతీ
సంవత్సరం నాకు తెలుసు. నా రెండవ ప్రయత్నం లోనూ ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్
మళ్ళీ దెబ్బ పడింది..... నా ప్రిలిమ్స్ పాస్ కావడంలో మా నాన్న పాత్ర ఉంది, ఏంటంటే ప్రిలిమ్స్
లో నా సబ్జెక్టు హిస్టరీ నా మొత్తం ప్రీపరషన్ దాని మీదే, రోజుకు పద్దెనిమిది నుండీ
ఇరవై ఘంటలు చదివేవాడిని అంటే కొంతమంది నమ్మక పోవచ్చు కానీ అదినిజం, కానీ నేను నా
జనరల్ నాలెడ్జ్ పేపర్ కు అంత శ్రమ పెట్టలేదు అసలు శ్రమే పెట్టలేదు అంటేనే కరెక్ట్,
కారణం ఏంటంటే నా పదవ తరగతి నుంచే మా నాన్న మాకోసం రెగ్యులర్ గా competition success తెప్పించే వారు నేను నా క్లాసు పుస్తకాలు చదవక పోయినా competition success మాత్రం రెగ్యులర్ గా చదివే వాడిని, అది మానాన్న నా
ప్రిలిమ్స్ సక్సెస్ లో నిర్వహించిన పాత్ర.
మెయిన్స్ మళ్ళీ దెబ్బ
పడింది అన్నా కదా, ఆప్పుడు తెలిసింది మా నాన్న ఎంత కరెక్ట్ రా అని, నా చిన్నప్పుడు
మా నాన్న పదే పదే ఒక విషయం చెప్పే వారు ఏమిటంటే, చదవండి రా చదువే మీకు రేపు అన్నం
పెట్టేది, మీరు పెద్ద అయ్యాక మరీ చదవాలంటే మరీ చిన్న వాళ్ళు కాలేరు కాబట్టి
ఇప్పుడే బాగా చదవండి అని..... అది ఆయన తన అనుభవంతో చెప్పిన మాట.....నా చదువంతా
అత్తెసరు మార్కులతోనే గడిచింది నేను ఎప్పుడూ ఖంటస్తం కొట్టింది లేదు ఇంత వరకూ ఏ
విషయం, అడిగిన ప్రశ్నకు నాకు తెలిసినది రాసేవాడిని, స్కూల్లో ఎప్పుడూ ఒకటే గొడవ,
నీ సొంత కవిత్వం ఎందుకు రా పుస్తకం లో ఉన్నది రాయలేవా అని.....సరే వదిలెయ్యండి మన
విద్యా విధానం గురించి విపులంగా తారవాత మాట్లాడుదాము, ఇక్కడ నేను చెప్పేదేమంటే
నేను నా మెయిన్స్ లో రెండు సార్లు ఫెయిల్ అయ్యినప్పుడు అదీ కేవలం నా రైటింగ్ వల్ల.....
చిన్నప్పటినుంచి మనం చెయ్యలేదు అది ఇప్పటికిప్పుడు రావాలంటే ఎక్కడినుంచి
వస్తుంది.... నాన్న ఎంత కరెక్ట్ రా..... ఇప్పుడు మనం మరీ చిన్న వాళ్ళమై పోయి అప్పుడు
చదవని చదువంతా చదవలేము కదా..... అప్పుడే నాన్న మాట విని ఉంటే అని ఎన్ని సార్లు
అనుకోనిఉంటానో యిప్పటికీ.
సరే ఆ తరవాత మరొక్క
ప్రయత్నం చేసి ఇక మనకు ఓపిక లేదు అని(ఒక సారి రాయాలి అంటే ఒక
సంవత్సరం ఆగాలి), మా నాన్నను ఒప్పించి సాఫ్ట్ వేర్ కోర్స్ లో
చేరి అక్కడ కూడా మొదటి ప్రయత్నం లోనే జాబు కొట్టి ఇదిగో ఇలా అమెరికాలో పడ్డాను.
సాఫ్ట్ వేర్ కు షిఫ్ట్
కావడానికి ముఖ్య కారణం, అప్పటికే మా నాన్నా రిటైర్ అయ్యారు, ఇక ఇంకా వారికి భారంగా
ఉండ కూడదన్న కారణమే నన్ను ఆ వైపు నడిపించింది. అందుకు ఆయన జీవితమే నాకు స్పూర్తి,
ఐప్పటికీ.....ఎప్పటికీ....
****
మా నాన్న పదకొండు మంది
సంతానం లో అగ్రజుడు, మా తాత బ్రిటీషు వారి హయాములో ఒక పోలీసు కానిస్టేబుల్. అనంతపురం
లో పాత పోలీసు క్వార్టర్స్ లో ఉండే వారు, మా నాన్న నన్ను ఒక సారి పోలీస్ లైన్స్ లో
తాము ఉన్న ఇల్లు చూపించారు(అప్పటికి అవి శిథిలావస్తలో ఉండేవి), నాకు ఆశ్చర్యం
వేసింది అంత చిన్న గదిలో అంత మంది ఎలా ఉండేవారో అని, పోలీస్ లైన్ స్కూల్ లో మరియూ
గోవర్నమేంట్ హై స్కూల్ లో చదివి, పదవ తరగతికే టైపు హయ్యర్, షార్ట్ హండు చేసిన ఆయన
ఇంటికి ఆర్థికంగా సహాయంగా ఉంటుందని అనంతపురం కోర్ట్ లో టైపిస్టుగా పనిచేస్తూ
చదువుకొన్నారు. అలానే అనంతపురం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ లో డిగ్రీ పూర్తీ చేసారు
ఆయన. చదువే ధ్యేయంగా ఆయన ఆ కాలేజీ లో చదివితే అదే కాలేజీ లో మనం అల్లరే ధ్యేయంగా
గడిపాము మూడు సంవత్సరాలు....
ఇప్పటికీ బాగా గుర్తు ఆయన
తన చిన్న తనం లో గడిపిన జీవితం, సంఘటనలూ అప్పుడప్పుడూ చెప్పేవారు, నా ఆలోచనా సరళి
లో దాని ప్రభావం చాలా......
వేర్ హౌస్ కార్పోరేషన్ లో(Warehousing Corporation) సికిందరాబాద్ రీజినల్ మానేజరుగా రిటైర్ అయ్యారు
ఆయన....తాతల ఆస్తులు లేవు కానీ ఆయన సక్సెస్ లో నేను చూసినది నిబద్దత, పట్టుదల, విషయ
పరిజ్ఞానం....
ఆస్తులు అంతస్తులు అవసరం
లేదు..... ఆయన చేతల ద్వారా ఆయన జీవితం ద్వారా నేను నేర్చుకున్నది, జీవితం లో డబ్బు
కాదు ప్రధానం, ఏదన్నా సాధించడానికి ధృఢసంకల్పం ముఖ్యం....
(కాప్టెన్, అని
ఎందుకన్నానంటే... వేర్ హౌస్ మేనేజర్ కాక ముందు ఆయన ఆర్మీ లో కెప్టెన్ గా ట్రైనింగ్
పొందారు. ఇప్పటికీ అనంతపురం లో అయన పాత స్నేహితులు ఆయనను కాప్టెన్ శ్రీరాములు అనే
పిలుస్తారు)
(సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో నా సక్సెస్ కు నా మిత్రుడు
రాజు సహాయం ఎప్పటికీ మరువలేనిది, నేను చదివిన హిస్టరీ పుస్తకాలన్నీ రాజు పుస్తకాలే)
happy fathers day.
ReplyDeletechaalaa chakkaga mee naannanu maa andhariki parichayam chesinanduku thank you sir.
Thank you very much for the comments sir.
Deleteనాన్నా గురించి వ్రాసినందుకు మనస్పూర్తిగా అభినందనలు. Yes, we feel proud of our father.
ReplyDeleteWe salute our Captain!
Best Wishes,
Suresh Peddaraju
Thank you Sukumar.
Deleteయెంత చక్కని విషయాలు షేర్ చేసుకున్నారు.
ReplyDeleteనాన్న బాధ్యత చాలా కష్టం.మంచి అనిపించుకోవాలి,కటిననగా ఉండాలి.
నాన్న గూర్చిన రెండో కోణం చాలా చక్కగా వ్రాసారు.
ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయాలు.
ఒక మంచి కుమారుని కన్నందుకు మీ నాన్నగారికి అభినందనలు
ధన్యవాదాలు శశి కళ గారు. మీ అభిప్రాయం షేర్ చేసుకున్నందుకు.
Deleteanna peddaనాన్నా గురించి వ్రాసినందుకు మనస్పూర్తిగా అభినందనలు. naku artham aindi brother thanku so much HAPPY FATHERS DAY 2 PEDDANANA CONVEY MY WISHES 2 PEDDANANA BROTHER...... (PARTHI OKARU ALOCHINCALSINA VESHAYAM ) THANKU SO MUCH ANNA.....PEDDANANA GURINCHI RASINANDUKU VERY VERY THANKS.
ReplyDeleteThank you very much Naveen for sharing your comments, yes there is a lot to learn from him.
DeleteRamesh
మా అన్న, అదే మీ నాన్న మాకూ ఆదర్శం, తమ్ముల్లందరూ బాగా చదివి మంచి పోసిషన్ లో ఉండాలని కోరుకున్న మహామనిషి, కాబట్టి ఆయన పెద్దరాజు సోదరులందరికీ కెప్టన్. మీ నాన్నా గురించి పాత జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు థాంక్స్ రమేష్.
ReplyDeleteపెద్దరాజు లక్ష్మినారాయణ.