మనిషే మనిషిని, మనిషిగా
గుర్తింప జేయలేని ఈ కుల వ్యవస్థ మీద మనిషికి ఎందుకంత మక్కువ?
మనిషిని మూర్ఖుణ్ణి
చేస్తున్న ఈ కుల వ్యవస్థ అంటె నాకు అసహ్యం....
మనిషి ఆలోచనా శక్తిని హరింప చేస్తున్న ఈ కుల వ్యవస్థ అంటె నాకు... వొళ్ళు మంట...
మనిషి సామర్థ్యాన్ని గుర్తించడానికి అడ్డు వస్తున్న ఈ కులవ్యవస్థ అంటె నాకు... కంపరం...
ఎదుటివాడిని నీదేకులం
అని నేను అడిగిన నాడు మనిషిగా నేను చచ్చిన
రోజు....
కానీ నీదేకులం అని నన్నడిగే వాడిని ఏమిచెయ్యాలి భగవంతుడా?
కానీ నీదేకులం అని నన్నడిగే వాడిని ఏమిచెయ్యాలి భగవంతుడా?
నాకు ఆ మానసిక రోగాన్ని
ఇవ్వనందుకు నీకు మొక్కడం తప్ప..... నేనేమి
చెయ్యగలను స్వామీ...