2009 May 8th ఉదయం పది గంటలు నా జీవితం
లో జరిగిన అద్భుతం నువ్వు రా నాన్నా.

రోజూ పడుకొనే ముందు బుక్కు
చదుపిచ్చు నాన్న అని నువ్వు రైమ్స్ బుక్కు
తెస్తే, నీతో చేరి నేను ఆ పాత పద్యాలను
నెమరు వేసుకొంటూ తెలియని కొత్త పద్యాలను నేర్చుకొంటూ మరొక్కసారి చిన్న వాడిని
అయిపోయి....
మూడవ జన్మదినం నీవు పుట్టిన
దేశంలో జరుపుకోబోతున్న మా పెద్దరాజుల చిన్ని రాజా...
అంతవరకూ ఏ పసి పాపనూ నా
చేతులతో ఎత్తుకొని ఎరుగను... భయం, ఎక్కడ నా మొరటు చేతులు తగిలి నొప్పి కలుగుతుందో
అని... కానీ నువ్వు పుట్టిన కొన్ని క్షణాలలోనే హాస్పిటల్ నర్స్ నిన్ను నాచేతిలో
పెట్టిన క్షణం, ఆ క్షణం ఇంకా నా మదిలో అలానే ఉంది.. ఇక ఆ మధుర క్షణాన్ని
మరిచిపోలేను కూడా ఎప్పటికీ....కానీ కొంచం సేపుతరవాత నన్ను నేను నమ్మలేదు... ఏమిటి
నేను అప్పుడే పుట్టిన ఒక పసి వాడిని నా చేతులతో ఎత్తుకోవడమా.. అని.
దేశం కాని దేశం లో డాలర్
వెనక పడి పరిగెత్తే జీవిత హైరానా లో మన పండగలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో
తెలియదు చాలా సార్లు.. తెలిసినా అది వారం మధ్య అయితే చేసేదేమీ ఉండదు కదా.. ఓహో
ఈరోజు అదా అనుకోవటం తప్ప...
ఆ రోజు ఆఫీస్ నుండి రాగానే
మీ అమ్మ ఈ రోజు కృష్ణాష్టమి అట, ఫోన్ చేస్తే అమ్మ చెప్పింది అంటె అప్పటికప్పుడు
నిన్ను చిన్ని కృష్ణునిగా తయారు చేసి.. ఆ వటపత్రశాయిని నీలో చూసుకున్న రోజు......
ఆస్ట్రేలియా వెళ్ళిన వారం
నువ్వు కరెంటు ప్లగ్ పైన పడి ముఖానికి ఘాటు పెట్టుకొంటే, భాద పడి దేవుడే నీకు
దిష్టి చుక్క పెట్టాడులే అనుకొన్న రోజు ఇంకా జ్ఞాపకమే, సిడ్నీ అన్న ప్రతీసారీ
నువ్వు ప్లగ్గు మీద పడి అబ్బు అయ్యింది అంటూ ఇప్పటికీ ఆ దుర్ఘటన గుర్తుచేస్తూనే
వుంటావు కాదా...ఆ జ్ఞాపకాల చిత్రమే ఇది..
నీ మొదటి జన్మదినం
ఆస్ట్రేలియా సిడ్నీ
సిడ్నీ లో జరుపుకున్నా.. కుటుంబ సంభందీకులు ఎవరూ
లేరే అన్న లోటు ఉండకూడదని.. నీ బాబాయ్, మామ అతిథులుగా వచ్చినరోజు
నా చిన్నప్పుడు నేనే తయారు చేసిన
గాలి పటం మేడమీద ఎగిరేసి ఆనందిస్తున్న నన్ను.... అమ్మ చూసి చదువు సంధ్య లేకుండా
గాలి పటాలు ఎగారేస్తున్నావా అని అరిస్తే ఆ రోజుతరవాత మరీ ఎప్పుడూ ఆ ఊసే లేదు..
కానీ ఆ సరదా మరీ నీతోనే.. తీర్చుకున్నా... సిడ్నీ బొండై బీచులో గాలి పటాల పండగ లో మరొక్క
సారి నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుచేసావు ఆరోజు....
నాకు దీపావళి అంటే చాలా
ఇష్టం, చిన్నప్పటి నుంచీ ఆ పండగతో ఎన్నో జ్ఞాపకాలు...కానీ దేశం విడిచిన తరవాత
ప్రతీ దీపావళీ రోజు ఏదో నిరాస నిస్పృహ.. జీవితంలో మరో దీపావళి ఒక్క పటాసు కూడా
వెలిగించకుండానే గడిచిపోయిన్దా అని అనుకొన్న సందర్భాలు ఎన్నో.. కానీ నువోచ్చాక మరీ
ఆ చిన్న నాటి రోజులు తిరిగి వచ్చాయి కాదా.. పెద్ద పెద్ద మతాబులు, తారాజువ్వాలు
లేకున్నా కేవలం కాకరపూలు మాత్రమే కాల్చుకో గలిగినా నీతో కలిసి నా చిన్న నాటి
జ్ఞాపకాలతో మరొక్క సారి చిన్న వాడిని అయ్యిన రోజు....
నీవు మాటలు మాట్లాడటం
మొదలెట్టి ప్రతీదానికీ నీదైన పదం పలుకుతూవుంటే నీపేరుమీద ఒక చిన్న నిఘంటువు
రాసుకొన్న రోజు ఇంకా జ్ఞాపకమే...
నీ రెండవ జన్మదినం చెన్నై
సుప్పు, బుడ్డు, తాత నానమ్మల సమక్షంలో....
స్కూల్ లో నీ మొదటి రోజు,
నాకు మరీ నా చిన్ననాటి అరవింద్ ఆశ్రమం రోజులు గుర్తుకోచ్చిన రోజు...
నీ బొమ్మలతో నిన్ను ఆడిస్తూ
అన్నీ మరిచిపోయి నీతో నీవయసువాడినై పోయి ఆడుతూవుంటే ఆహా మల్లీ నా చిన్నతనం వస్తే
ఎంత బాగుండు అనుకొంటూ....
నీకు జన్మదిన
శుభాకాంక్షలు..... మరెన్నో ఎన్నెన్నో జన్మదినాలు నీవు జరుపోకోవాలని, నీతో కలిసి
నేనూ నా చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకొంటూ ఆ అల్లరి మరీ ఇప్పుడు చేస్తూ గడపాలని
కోరుకొంటూ, నీ ఉజ్వల భవిష్యత్తు ఆశిస్తూ...
....నాన్న







Happy Birthday Amrith!
ReplyDeleteAwesome Ramesh !!! Cud see ur love in every word ....
ReplyDeleteజన్మదిన శుభాకాంక్షలు అమ్రిత్..
ReplyDeleteHappy Birthday to your son Amrith! A Taurus boy!!! Will be strong like a bull in making decisions and sticking to what he decides in life! May God bless him on this special day.
ReplyDeleteమీ అమ్రిత్ కు జన్మదిన శుభాకాంక్షలు .
ReplyDeleteఅమ్రిత్ ముద్దుగా వున్నడు . మీ భావాలు మీ ప్రేమను వ్యక్తం చేస్తున్నాయి . బాగుంది .
Happy Birthday and BLessings to Amrit..
ReplyDeleteవిష్ చేసిన అందరికీ ధన్యవాదాలు.
ReplyDeleteవెన్నెల గారు కరెక్ట్ అండీ మా వాడు ఇప్పుడే ఆ లక్షణాలన్నీ చూపెడుతున్నాడు.
రమేష్
Mee blog Super... vaadi twinkle twinkle adhurs
ReplyDeleteThank U Prakash
ReplyDelete